Telangana
పెళ్లి రోజు సందర్భంగా నిరుపేదకు ఆర్థిక సాహయం చేసిన కార్పోరేటర్ పోన్నం
కళింగ టైంస్, గోదావరిఖని : వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నార్తుల ఆకలి తీర్చేందుకు 48 వడివిజన్ కార్పోరేటర్ పోన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ బియ్యం తో పాటు ఆర్థిక సహాయాన్నిడివిజన్ లోని ఒక నిరుపేద కుటుంబానికి అందించారు.
శుక్రవారం రోజు నిరుపేదకుటుంబమైన ఓదెల శ్రీనివాస్ వారి నాన్న ఓదెల నగేష్ చనిపోవడం జరిగింది రెక్కాడితె గాని డొక్కాడని పరిస్తీతుల్లో ఉన్న శ్రీనివాస్ టైలరింగ్ షాప్ లో కూలి పని చేస్తు కాలం వేల్లదీస్తున్నాడు ఈ విషయం కార్పోరేటర్ దృష్టికి తీసుకురాగ కార్పోరేటర్ స్పందించి వారి కుటుంభానికి ఆర్దిక సాహయం చేసి అలాగె నెలకి సరిపడ బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పోరేటర్ మాట్లాడుతూ ఆకలితో అలమటించే అభాగ్యులు చాలమంది ఉన్నారు ఇందులో భాగంగ ఈ రోజు ఒక కుటుంభాన్ని ఆదుకున్నందుకు నాకు చాల ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమం లో పొన్నం రాంముర్తి గౌడ్,టైలర్ నారాయణ, పన్నాల శంకర్,ప్రకాష్,క్రుష్ణ,తదితరులుపాల్గోన్నారు .