Telangana
ప్రైవేట్ పాఠశాలలు యు-డైస్ లొ లేని వారికి ప్రభుత్వం సహాయం అందించాలి

కళింగ టైంస్, గోదావరిఖని : కరోనా కష్టకాలంలో ప్రైవేట్ టీచర్స్ కి ప్రకటించిన రెండు వేల రూపాయలు ,బియ్యం కొంతమంది టీచర్స్ కు మాత్రమే అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలు యు-డైస్ లొ అందరి వివరాలు ముందు పొందు పరుచనందున , ప్రైమరీ, అన్ ట్రైన్డ్ టీచర్లు ,అయిదు,అటెండర్లు వాచ్మెన్లూ , డ్రైవర్లు సహాయానికి నోచుకోవడంలేదు విరందరూ ప్రైవేట్ పాఠశాలలను నమ్ముకొని బతికే వారే, కావున మొదటి దశ నుండి రెండవ దశ వరకు విరంఅందరి పరిస్థితిని ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, భాజపా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గుండెబోయిన లక్ష్మణ్ యాదవ్ ఒక ప్రకటన లో ప్రభుత్వానికి విన్నవించారు