Telangana
కరోనా సెకండ్ వేవ్ నివారణకు రామగుండం కార్పోరేషన్ 45 వ డివిజన్ లో ఫాగ్గింగ్
Kalinga Times,Godavarikhani : రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ స్థానిక 45 వ డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు గారి ఆధ్వర్యంలో ఫాగ్గింగ్ చేయడం జరిగినది.ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు గారు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ మొదలైనది అని ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటికి వచ్చేటపుడు తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని ,సామాజిక దూరం పాటించాలని ,సానిటీజర్ వాడాలని మరియు తెలంగాణలో కరోనా కేసులు పెరగడం వల్ల ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం జరిగినది అని ప్రతి ఒక్కరు ప్రతి రోజు రాత్రి 9గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఎవరు బయట తిరగవద్దు అని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు,జనగామ శంకరయ్య ,మీనుగు సురేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు