Telangana
కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలి.
- ఈదునూరి ప్రేమ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు
Kalinga Times,Godavarikhani : దేశవ్యాప్తంగా కోవిడ్-19 కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తున్న సందర్భంలో రోజు వారిగా వందల కేసులు నమోదవుతున్నా నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కోవిడ్-19 కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు కరోనా వైరస్ వైద్యసేవలను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కూలి నాలి చేసుకుని బ్రతికే ప్రజలు వైరస్ బారినపడి ప్రభుత్వం హాస్పిటల్ లో వైద్యం అందక ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించుకునేంత స్తోమత లేని ప్రజలు నిస్సహాయ స్థితిలో ప్రాణాలను వదిలేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందిచాలని కోరారు.