భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గురువారం 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కావటం ఆందోళన కల్గిసున్నాయి.
Kalinga Times,Hyderabad : 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,185 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. ఇప్పటి వరకు 1,74,308 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇదిలావుండగా 11,72,23,509 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెళ్ళడించింది. .
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వరూపం
గడిచిన 24 గంటల్లో తెలంగాణ లో 3,840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 9 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిదిలో 505, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గురువారం రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర విద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. .రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 కు చేరింది.రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 505 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 407, రంగారెడ్డి జిల్లాలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175, జగిత్యాలలో 167, కామారెడ్డిలో 144, కరీంనగర్‌లో 124, ఖమ్మంలో 111, మహబూబ్‌నగర్ జిల్లాలో 124, మంచిర్యాలలో 101, నల్లగొండ జిల్లా లో 116, నిర్మల్ జిల్లాలో 159, వరంగల్ అర్బన్ జిల్లా లో 114 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రికవరీ రేటు తగ్గుతుండటం ప్రభుత్వ వర్గాల్లో కలవరం పెంచుతోంది. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో బెడ్ల కొరత మొదలైంది. సినిమా థియేటర్ల మాదిరి ప్రైవేట్ ఆస్పత్రుల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.