Telangana
యువత సాహసోపేత నిర్ణయాలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి

యువత ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేయగలరని ప్రముఖ లెక్చరర్ ఆధ్యాత్మిక వేత్త మంతెన శ్రీనివాస్ అన్నారు.
Kalinga Times,Godavarikhani : ఆదివారం ఆలయ ఫౌండషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలయ యూత్ ఎంపవర్ మెంట్ కార్యక్రమంలో భాగంగా అంతర్గాం,పాలకుర్తి మండలాలలోని సోమన్ పల్లి,విస్సం పెట,బ్రహామ్మణపల్లి మరియు వేమ్నూరు,కొత్తపల్లి గ్రామాలలో పాల్గొని ఆయన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా మంతెన శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్దికి శ్రీకారం చుట్టాలని యువతను కోరారు.అనంతరం ఆలయ ఫౌండేషన్ సి.ఇ.ఒ రమేష్ బాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సామాజిక సేవ కార్య క్రమాలను మన బసంత్ నగర్ ముద్దుబిడ్డ సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి పరికిపండ్ల నరహరి గారి నేతృత్వంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు.యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం అనేక చోట్ల జాబ్ మేళా లను ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు.కాళ్ళు కోల్పోయిన చాలా మంది పేదల్కు జైపూర్ ఫుట్ ను అందిచామన్నారు. తన గ్రామాల యువకుల కోసం నరహరి గారు యూత్ ఎంపవర్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారని దీనిని ఈ పది గ్రామాల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆలయ యూత్ ఎంపవర్ మెంట్ కార్యక్రమ ఆర్గనైజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామీణ యువత సమైక్యతతో ముందుకు వస్తే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలలో భాగస్వాములను చేసె వీలుంటుందన్నారు.శ్రీ సిద్ధార్థ పాఠశాల కరస్పాండెంట్ తిరుపతి మాట్లాడుతూ నేటి యువత సాహసోపేత నిర్ణయాలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,ఎం.పి.టిసిలు,యువకులు పాల్గొన్నారు.