social

గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ఆలయ ఫౌండషన్ కృషి చేస్తుంది – నరహరి IAS

తన గ్రామానికి ఎంతో కొంత కృషి చేసి అభివృద్ధి చేయాలనే సంకల్పం కొద్ది మందికి మాత్రమే ఉంటుంది.. అందులోనూ క్షణం తీరికలేని  ఒక ఉన్నత అధికారికి ఉండటం చాలా అరుదు..

Kalinga Times,New Godavarikhani :మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరి గా,కమీషనర్ గా బాద్యతలు నిర్వహిస్తూ ఉత్తర తెలంగాణాలో ఆలయ ఫౌండషన్ ప్రారంభించిన నరహరి IAS , అనేక సేవా కార్య క్రమాలు చేపట్టి అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు.యువతరం ఆశలు,ఆశయాలను నెరవేర్చే గొప్ప ఆవిష్కరణలకు  ఆయనఆదివారం   శ్రీకారం చుట్టారు.
బసంత్ నగ లో జాబ్ మెళా


ప్రముఖ కంపనీలలో ఉపాధి అవకాశాలను అందించడం కోసం బసంత్ నగర్లో హైదరాబాద్ లో గల HYSE PLACEMENT SERVICE PVT LTD సంస్థ చే ఉచిత మెగా జబ్ మేళా ను ఆయన ఆధివారం ప్రారంభించారు.ఈ జాబ్ మేళాలో ప్రముఖ కార్పోరేట్ సమ్షలు పాల్గొన్నాయి. HYSE డైరెక్టర్ కె.మనేష్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను అటెండ్ చేసి జాబ్ ను సాధించాలని అభ్యర్థులను కోరారు.
ఆలయ యువ సాధికారత మిషన్

గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా పాటు పడే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి కెంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో భాగస్వాములను చేసె ఆలయ యువ సాధికారత మిషన్ ప్రారంభించి పోస్టర్ ను నరహరి IAS విడుదల చేశారు. ఆలయ యువ సాధికారత మిషన్ నిర్వహణ బాద్యులు కృష్ణమూర్తి మాట్లాడుతూ మోడల్ ప్రాజెక్ట్ కోసం ముందు పది గ్రామాలను ఎంపిక చేసి కార్యాచరణ చేపడతామన్నారు.
జన అధికార సమితి


అనంతరం ఆయన బలహీన వర్గాలతో పాటు బిసి సామాజిక వర్గాలకు చెయూతనందించే ఒక రాజకీయ,సామాజిక శిక్షణా సంస్థ జన అధికార సమితి పోస్టర్ ను విడుదల చేశారు. ఈ వేదిక ముఖ్యంగా సామాజికంగా,రాజకీయంగా అవకాశాల గుర్తింపు కోసం అందరిని సంఘటితం చేయడం,అవగాహన తరగతులను నిర్వహించడం, ఆయా వర్గాలలో సంబందిత విషయాలపై సామర్ధ్యాన్ని పెంపొందించి ,సమానత్వాన్ని సామాజిక న్యాయం సాధించడం లో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సంస్థ చేపట్టే మంచి కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close