Telangana

గోదావరిఖని శివారులో చిరుత పులి సంచారం – తీవ్ర ఆందోళనలో స్థానికులు

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని నగర శివారులో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. గత వారం రోజుల నుండి గోదావరిఖని చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పులులు ఎక్కువగా తిరుగుతున్నాయని స్థానికులు వెల్లడించారు.

Kalinga Times,New Godavarikhani :  చిరుత పులులు 1 ఇంక్లైన్ వద్ద రెండు కుక్కలను చంపేశాయి, రెండు రోజుల క్రితం 11ఇంక్లైన్ మైన్ వద్ద కార్మికుడికి కనిపించింది. తాజాగా ఈరోజు తెల్లవారుజామున మల్కాపుర్ శివారులోని గోదావరి నది తీరాన రెండు చిరుత పులులను జాలర్లు చూశారు. స్థానికులు గ్రామస్తులు సమాచారం అందించడంతో వెంటనే అటవి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మల్కాపూర్ గ్రామ శివారు FCI ఫిల్టర్ బెడ్ సమీపంలో చిరుత పులుల అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దనీ… సాయంత్రం వేళ చీకటి పడకముందే ఇళ్లలోకి వెళ్లిపోవాలని తెలిపారు. చిరుత పులులు సంచారం చేస్తుండడంతో గోదావరిఖని ప్రజలు, కార్మికులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిరుత పులులను అటవీ శాఖ అధికారులు త్వరగా గుర్తించి బంధించాలని ప్రజలు కోరుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close