Telangana
ఎంజీబీఎస్ కు ఆర్టీసీ పార్శిల్ కార్గో లో మృత పిండం
హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద ఓ పార్టిల్ కలకలం రేపింది. పార్శిల్ నుంచి తీవ్ర దుర్వాసర రావడం రావడంంతో అనుమానం వచ్చి దాన్ని తెరిచారు. ఆ పార్శిల్ లో ఓ మృత పిండం ఉండటంతో అంతా అవాక్కయ్యారు.
Kalinga Times,Hyderabad : నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఓ మృతపిండాన్ని పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించాలనుకున్నారు. అయితే అలాంటివి పంపేందుకు ఏదైనా ప్రత్యేక వాహనం ద్వారానో, అంబులెన్స్ ద్వారానో తరలించాల్సి ఉంటుంది.
ఆర్టీసీ బస్సుల ద్వారా కార్గో సర్వీసులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కార్గో సర్వీసు ద్వారా మృత పిండాన్ని పంపించాలనుకున్నారు. పార్శిల్ ను ఓ సిమెంట్ బస్తాలో కట్టి హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ కేంద్రానికి పంపించారు. నల్లగొండ జిల్లాలోని కార్గో సర్వీసు సిబ్బందికి దాంట్లో ఏముందో తెలియక ఆ పార్శిల్ ను తీసుకెళ్లారు.హైదరాబాద్ కు వచ్చేసరికి ఆ మృత పిండం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బటయపడింది. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన ఓ ల్యాబ్ వాళ్లు కార్గో కేంద్రానికి వచ్చి ఆ పార్శిల్ ను తీసుకెళ్లారు.
అయితే ఈ ఘటన డిసెంబర్ 23న జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై డయాగ్నస్టిక్స్ నిర్వాహకులను ప్రశ్నిస్తే అలా పంపిస్తే తప్పేంటని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మరోవైపు మృతపిండాన్ని కార్గో సర్వీసు ద్వారా తరలించిన సంగతి నిజమేనని నల్లగొండ జిల్లా ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ శ్యామల అంగీకరించారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా మృతపిండాలను తరలించకూడదని, కొన్ని రకాల ల్యాబ్ పరీక్షలకు మాత్రమే దీన్ని పాటించాల్సి ఉంటుందని సూచించారు.