social
ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరహరి ఐ.ఎ.ఎస్ కు కృత్ఞతలు – ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్.పి సుదీంద్ర
అనుకోని సంఘటనల వలన దురదృష్టవశాత్తు కాలు కోల్పోయిన బాదితుల సమాచారాన్ని తెలుకొని పెద్ద మనసుతో వారికి కృత్రిమ కాలు ఏర్పాటు చేయించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ సెక్రటరి మరియు కమీషనర్ పరికి పండ్ల నరహరి ఐ.ఎ.ఎస్ కు మరియు ఆలయ ఫౌండషన్ ప్రతినిధులకు ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్.పి సుదీంద్ర కృత్ఞతలు తెలిపారు.
Kalinga Times, Asifabad : ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం కు చెందిన నీతూ బాయ్,పాము కాటు కారణంగా మరియు కొమరం పాండు, యాక్సిడెంట్ కారణంగా వీరు కాలు కోల్పోయారు. కృత్రిమ కాలు కోసం ఆలయ ఫౌండేషన్ సభ్యులు కీర్తి నాగార్జున ని సంప్రదించగా ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకులు శ్రీ పి.నరహరి ఐ.ఏ.ఎస్ చొరవతో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో బాధితులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు అమర్చడం జరుగింది.
అయితే శుక్రవారం (జనవరి 1)న బాధితులను మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులను ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ సుధీంద్ర తన కార్యాలయంకు పిలిపించుకొని,ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సహాయం చేసినందుకు ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరహరి గారికి ఫోన్లో కృత్ఞతలు తెలిపారు. తిర్యాని ఎస్.ఐ రామారావు ని అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ అచేశ్వర రావు,కాగజ్ నగర్ డిఎస్పీ స్వామి మరియు ఫౌండేషన్ సభ్యులు కీర్తి నాగార్జున,జాగిరి శ్రీకాంత్ పాల్గొన్నారు..