National
ప్రింట్ మీడియా ఇస్తున్న సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు హైజా క్
Kalinga Times,Banglore : ఆదాయాన్ని పొందడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంప్రదాయ మీడియా, లాభాలు గడిస్తున్న సోషల్ మీడియా దిగ్గజాల మధ్య ఆదాయ పంపిణీపై సరి కొత్త చట్టాలు, మార్గదర్శకాల అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గణనీయమైన ఖర్చుతో ప్రింట్ మీడియా ఇస్తున్న సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు హైజా క్ చేస్తున్నాయని, ఇది అన్యాయమని వ్యాఖ్యానించారు. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(ఎంఎహెచ్‌ఈ) ఆధ్వర్యంలో శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన.. ప్రముఖ పాత్రికేయులు ఎంవీ కామత్ 6వ స్మారకోపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ‘జర్నలిజం: గతం, వర్తమానం, భవిష్యత్’ అనే అంశంపై హైదరాబాద్ నుంచి ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా దిగ్గజాలు తమ ఆదాయంలో కొంత పత్రికలకు అందించేలా కొన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పా రు. అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న సోషల్ మీడియా సంస్థలు అందులో కొంత పత్రికలకు పంచేలా చట్టాలు, మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరముందన్నారు