Telangana
ఖని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై సిపిఐ నగర సమితి మండిపాటు
Kalinga Times,Godavarikhani : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి తీరు ఉందని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ దుయ్యబట్టారు . ఆయన ఆస్పత్రిని సందర్శన చేసి రోగులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ ముఖ్యంగా డయాలసిస్ కేంద్రంలో రోగులు డయాలసిస్ చికిత్స చేయించుకునే సమయంలో కరెంట్ పోతే చాలా ప్రమాదకరమని వారికి జరగరానిది జర్గితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డయాలసిస్ కేంద్రాన్ని క్రింది అంతస్థు లోకి మార్చి మరొక అయిదు మిషన్స్ ఏర్పాటు చేయాలని అలాగే రోగుల సౌకర్యార్థం కొరకు జెనరేటర్, ఇన్వెర్టర్స్ బ్యాటరీస్, ఏర్పాటు చేయాలని అదికారలకు , అభివృద్ది కమిటీకి ఎన్ని సార్లు చెప్పిన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆస్పత్రి ఆవరణలోనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉంటది కానీ ఆస్పత్రిలో నిరంతరం విద్యుత్ ఉండక పోవడం శోచనీయం దురదృష్టకరమన్నారు. కరెంట్ పోతే ఆస్పత్రి చీకటి మయం అవుతుందని, నిరంతరం ఆస్పత్రిలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని,మంచినీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డెలివరీ కి వచ్చిన మహిళల బంధువుల దగ్గర నుండి కొందరు ఆస్పత్రి సిబ్బంది ఆర్థిక దోపిడీ గురిచేయడం సరి కాదని వారిని హెచ్చరించారు. మరల ఇలాంటివి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారని హెచ్చరించారు. వైద్య సిబ్బంది కొరతను కూడా తీర్చాలని దినేష్ సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేనికుంట్ల ప్రీతం, రవి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.