Religious

శ్రీమాతదర్శనం. ఇది ఎన్నిజన్మలకు సాధ్యమో!

Kalinga Times,Hyderabad : శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వ రూపానుభవము కలుగుతుంది.
నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు
త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు, తొలగించుకో వలసిన తెరలు, అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్నిశ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి. వాటిని లేకుండా చేయలేం. అందువల్లనే త్యాగరాజస్వామి కూడా తెరను తొలగించమని ప్రార్థించారు తప్ప, తెరలేకుండా చేయమనలేదు. మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవావరణములను నిర్లిప్తతతో,నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close