Religious

శ్రీ చక్రం నందు సకల దేవతలు కొలువై ఉన్నారు

Kalinga Times,Hyderabad : శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను.. మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు. అను పన్నెండు మంది, పన్నెండు శాస్త్రవిధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవతంత్రము తెలుపుచున్నది.
శ్రీ చక్ర నిర్మాణం.
బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము. బహిర్దశారమను దశత్రికోణచక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణములతో కూడినది శ్రీచక్రం.
శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈశ్రీచక్రము లోని తొమ్మిదిచక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు.
త్రికోణ, అష్ట కోణ, దశకోణద్వయము, చతుర్దశకోణములు ఐదూ శక్తికోణములు. బిందువు, అష్టదళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈచక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది. నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదుశక్త్యాత్మకం.
శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో
1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం, 2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం,
3. అష్ట దళ పద్మం – సర్వసంక్షోభిణీ చక్రం, 4. చతుర్దశారము – సర్వసౌభాగ్య చక్రం, 5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం, 6. అంతర్దశారము – సర్వరక్షాకర చక్రం, 7. అష్ట కోణము – సర్వరోగహర చక్రం, 8. త్రి కోణము – సర్వసిద్ధిప్రదా చక్రం, 9. బిందువు – సర్వానందమయ చక్రం..! ఒక్కొక్క ఆవరణలోనిదేవతలను సాక్షాత్కరించుకొనుటకు కొన్ని ప్రత్యేక బీజమంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్‌, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘగురువులు, సిద్ధౌఘగురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిది ఆవరణములలోని వివిధదేవతలు నమస్కారనవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధరకములైన మానసికప్రవృత్తులు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close