
Kalinga Times, Hyderabad : అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఈ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.