Religious
గుండా మల్లేష్ కు కన్నీటి వీడ్కోలు పలికిన ప్రజాసంఘాల నాయకులు
Kalinga Times, Godavarikhani : సిపిఐ సీనియర్ నేత బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మరణం ప్రజా ఉద్యమాలకు, పేద ప్రజలకు తీరని లోటని గోదావరిఖని సిపిఐ, ఎఐటియుసి ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆ విప్లవ నాయకుని మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని నేటికాలపు రాజకీయ నాయకులు, యువతకు గుండా మల్లేష్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పార్టీ ప్రజాసంఘాల నాయకులు గుండా మల్లేష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. గుండా మల్లేష్ గారి అంతిమ యాత్రలో పాల్గొని వారికి నివా ళ్లు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన అనంతరం నాయకులు మాటలుడుతూ.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు విలువలతో జీవించాడు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ముందుకుసాగాడు తప్ప రూపాయి సంపాదన లేకుండా ఆస్తులను కుడబెట్టుకోకుండ పార్టీని నమ్ముకొని జీవించిన వ్యక్తి గుండా మల్లేష్ గారు అని గుర్తు చేశారు. కే సి ఆర్ గారు ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించకపోవడం నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. గుండా మల్లేష్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తి నినదించి మహొత్తర నాయకుడిని ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహించ క పోవడం దుర్మార్గమని అదే అంద్రప్రంతనికి చెందిన వారు అయితే అన్ని ప్రభుత్వ లంచానాలతో నిర్వహించాలని ముందే ప్రకాటిస్తరని విమర్శించారు. అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించిన వారిలో సిపిఐ ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు వై గట్టయ్య, మడ్డి ఎల్లయ్య, తాండ్ర సదానందం, కే. కనుకరాజ్, మద్దెల దినేష్, తాళ్లపల్లి మల్లయ్య గోశిక మోహన్ గౌతమ్ గోవర్ధన్, బి. కనకయ్య, జాకబ్, స్వామి, చీకటి అంజయ్య. గండి ప్రసాద్,టి రమేష్ కుమార్, రేణిగుంట్ల ప్రీతం చంద్రశేఖర్ జక్కుల శ్రీనివాస్ జూపాక రామ్ చందర్, తదితరులు నివాళులు అర్పించారు.