Telangana
హత్రాస్ ఘటనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా లో ధర్నా
Kalinga Times, Godavarikhani : హత్రాస్ లో దళితురాలిపై పైశాచిక దాడి, ఆపై ఆమె మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగిల్చాయి. ఆ దాష్టికం పట్ల సామాజికా సంస్థలు,ప్రజా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.. దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు నిరసన జ్వాలలు మిన్నంటాయి. అందులో భాగంగా..పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా లో ప్రజసంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సంధర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు,ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరి,ఐలు రాష్ట్ర నాయకులు శైలజలు మాట్లాడారు. బి.జె.పి అధికారం లోకి వచ్చిన తర్వాత మహిళలపై,దళితులపై దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు.ఈ దారుణ సామూహిక అత్యాచార ఘటనపై మోది ప్రభుత్వం నేరస్తులను కాపాడటానికే ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు…