Telangana
మాజి ఎం.ఎల్.సి ప్రేం సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన 23 వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్
Kalinga Times, Mancherial : నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గా నియమించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసిసి సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ,డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గార్లకు కృతజ్ఞతలు కుంటున్నట్లు మంచిర్యాల మున్సిపాలిటీ 23 వ వార్డు కౌన్సిలర్ రామగిరి బానేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల వారి హక్కుల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎల్లవేళలా పాటుపడుతూ… షెడ్యూల్డ్ కులాల తో పాటు జిల్లాలోని బడుగు బలహీన వర్గాల అందరి ని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో కలుపుకుపోయి వారి ఐక్యతతో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.