National
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో..ఎ.ఐ.టి.యు.సి శతజయంతి ఉత్సవాలు
Kalinga Times, Godavarikhani : ఎ.ఐ.టి.యు.సి శతజయంతి ఉత్సవాల సంధర్భంగా ఆర్జీవన్ పరిదిలోని జిడికె 1ఇంక్లయిన్ లో సోమవారం ఉదయం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కేక్ ను కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ ఎ.ఐ.టి.యు.సి దేశవ్యాప్తంగా విశ్వసనీయమైన గుర్తింపును పొందిందన్నారు.కాలక్రమేణ కార్మిక చట్టాలలో వచ్చిన మర్పులను గమనిస్తూ కార్మిక హక్కులకు భంగం వాటిల్లినపుడల్లా విప్లవాత్మకమైన పోరాటాలు చేస్తూ కార్మిక హృదయాలను గెలిచిందన్నారు.ఎ.ఐ.టి.యు.సి దిన,దిన ప్రవ్ర్థమానమవుతూ..నేటికి వంద సంవత్సరాలు పూర్తిచేసుకొందని గుర్తుచేశారు..ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణిలో నేడున్న గుర్తింపు సంఘం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కి కల్లబొల్లి కబుర్లతోనె కాలయాపన్ చేసిందని ఆరోపించారు