Religious

మహాలయ అమవాస్య …పితృ పక్షం

పెద్దలకు బియ్యం ఇవ్వడం ఎందుకు

Kalinga Times, Hyderabad : మహాలయ అమవాస్య గురించి తెలుసుకుందాం..దీన్నే తెలంగాణ్లో పెత్ర అమాసగా చెప్పుకుంటాం..పెద్దలకు బియ్యం ఇచ్చి వారి దీవెనలు పొందుతాం..అసలు పెద్దలకు బియ్యం ఇవ్వడం ఎందుకు ..దాని వల్ల మనకు ఎలాంటి దీవెనలు అందుతాయి అనేది తెలుకుందాం. శ్రద్ధ అనే శబ్ధం నుండి శ్రాద్ధం ఉద్భవించింది. శ్రద్దా పూర్వకంగా చేయబడిన కార్యమునే శ్రాద్ధం అనబడును. పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినము వ్యక్తులకు సంబంధించింది. మహాలయ పక్షము సాముదాయకంగా పెద్దలకు పూజించడానికి ఏర్పడింది. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్ధాలని చెప్పబడింది. ఆ తొంభైఆరు శ్రాద్ధాల్తోను ఈ పితృపక్షం ముఖ్యం. మరి ఈ పితృ పక్షంలో పెద్దలను స్మరిచడం వల్ల మనకున్న సమస్యలను వారు తొలగిస్తారనే నమ్మకం మనది.వారు మనకు జన్మనిచ్చినపుడు మనమీద ఎన్నో కలలు కంటారు..నా బిడ్డలు ప్రయోజకులవ్వాలని కనబడిన దేవూళ్ళకల్ల పూజచేస్తారు..అలాగే వారు మరణిచిన తర్వాతకూడా మన పట్ల వారి ఆత్మ మన మంచి కోసమే తాపత్రయపడుతుందని గరుడ పురాణం లో చెప్పబడింది.. శ్రాద్ధదినం నాడు కర్మ చేసేవాడు శ్రాద్ధం పూర్తి అయ్యే వరకు ఉపవసిస్తాడు. తండ్రి బ్రతికి వుండగా తల్లిని కోలుపోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమినాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు ఒక గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసేవాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై వుంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి నివేదన ఇవ్వాలి. మహా అమవాస్యరోజు ఎంగిలి పూల బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.అయితే ఈ సారి అధిక మాసం రావడంతో బతుకమ్మ పండుగను మనం వచ్చే అమావాస్యకు చేసుకోవాలంటూ పండితులు చెపుతున్నారు.. ఒకవేళ అధిక మాసం కాకపోతే ఇదే రోజున ఎంగిలి పూల బతుకమ్మను సెల్బ్రేట్ చేసుకునే వాళ్ళం..

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close