Telangana

బలహీన వర్గాలకు మేలు చేసే రెవెన్యూ చట్టం-2020

Kalinga Times, Hyderabad : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. భూ నిర్వహణలో సరళీకృత,అవినీతిరహిత, బలహీన వర్గాలకు మేలు చేసేవిధంగాకొత్తగా చట్టాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా తొలుతప్రస్తుతం ఉన్న విఆర్వో (విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌)వ్యవస్థను రద్దుచేసింది. మరోపక్క నూతన రెవెన్యూచట్టాన్ని తీసుకొచ్చింది.మరోపక్క సమగ్ర భూసర్వేపై దృష్టిసారించింది.గతరెండేళ్లుగా పైలెట్‌ ప్రాజెక్టుకింద రాష్ట్రంలోని 21మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేసిన నూతన రెవెన్యూ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో ఆ దిశగా రాష్ట్ర మంతా వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నూతన రెవెన్యూచట్టాన్ని తీసుకొ చ్చింది. ప్రస్తుతంఉన్న భూమి రికార్డులకు సంబం ధించిన చట్టాల స్థానంలో ఇప్పుడు ది తెలంగాణ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌ బుక్‌ బిల్‌, ది తెలంగాణ అబాలిషన్‌ ఆఫ్‌ ది పోస్ట్‌ ఆఫ్‌ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ బిల్‌,ది తెలంగాణ పంచా యితీ రాజ్‌ఎమెండ్మెంట్‌ బిల్‌,ది తెలంగాణ మున్సి పల్‌లాస్‌ ఎమెండ్మెంట్‌ బిల్‌తో పాటు,జిహెచ్‌ఎంసీ చట్టానికి సంబంధించిన బిల్లులను తీసుకొచ్చింది.
తెలంగాణలో మొత్తం 1 లక్షా 12 వేల చదరపు కిలోమీటర్ల భూమి అంటే సుమారు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 1 కోటి 55లక్షలఎకరాలు వ్యవసాయభూమి కాగా,66.56 లక్షల ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. మిగిలింది ప్రభుత్వ భూమి, గ్రామ కంఠాలు, పట్టణాల కింద, ప్రజా ఉమ్మడి ఆస్తుల కింద ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు వీటి నిర్వహణలో తహసీల్దార్లే కీలకం కానున్నారు.అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోయిన రెవెన్యూ శాఖను ఈ సంస్కరణలు ఎంతవరకూ సంస్కరిస్తాయనేదానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది.కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పుడున్న అనేక వ్యవస్థలు, ఫాంలు, రికార్డు పుస్తకాల స్థానంలో ధరణి వెబ్‌సైట్‌వస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి వ్యవసాయ భూములకు సంబంధించినది కాగా, రెండవది వ్యవసాయేతర భూములకు సంబంధించినది.ఈ వెబ్‌సైట్‌ ఎవరైనా తెరవచ్చు. చూడవచ్చు. కాపీ చేయవచ్చు. డౌన్లోడ్‌ కూడా చేయవచ్చు. ఇకపై తెలంగాణ భూ రికార్డులకు ఇదే ప్రధాన రికార్డు ఆయువు పట్టు అవుతుంది ఈ వెబ్‌సైట్‌ దెబ్బతినకుండా,అందులో ఉన్న సమాచారంపోకుండా వేర్వేరు ప్రాంతాల్లో (డాటా బ్యాకప్‌ మల్టిపుల్‌ సర్వర్స్‌) నిక్షిప్తం చేస్తారు. ఇకపై రెవెన్యూ అధికారుల విచక్షాధికారాలు రద్దు అవుతాయి. తహశీల్దారు నుండి జాయింట్‌ కలెక్టర్‌ వరకూ ఎవరికీ విచక్షణాధికారులుండవు. వారు రికార్డుల నిర్వహణలో అక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. వీలైనన్ని సేవలు ఆన్‌లైన్‌ అవుతాయి. నేరుగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం బాగాతగ్గుతుంది. ఆయా భూములపై వచ్చిన వివాదాలపై కోర్టు తీర్పులను కూడా ఆన్‌లైన్‌ రికార్డులలో అప్డేట్‌ చేస్తారు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల తోపాటు,మ్యుటేషన్‌ కూడా తహశీల్దార్లే నిర్వహిస్తారు. తహశీల్దా ర్లందరికీ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా ఇస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వెళ్లక్క ర్లేదు.తహశీల్దార్ల కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి, వెంటనే అక్కడే మ్యుటేషన్‌ కూడా పూర్తి చేసి వాటి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ధరణి వెబ్‌సైట్‌లో అప్డేట్‌ చేసి పంపిస్తారు.కాగా ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తారు. అంటే వ్యవసాయం కిందకు రాని ప్లాట్లు, ఇళ్లు, అపార్టుమెంట్లు, కంపెనీల స్థలాలు, గ్రామ కంఠం (ఆబాదీ) ఇవన్నీ వీరి కిందికి వస్తాయి. వాటి మ్యుటే షన్లు కూడా ఇకపై సబ్‌రిజిస్ట్రార్లే చేస్తారు. మ్యుటేషన్‌ కోసం వేరే ఎక్కడికీ వెళ్లక్కరలేదు. కొత్త విధానం ప్రకారం రిజిస్ట్రేషన్‌కి సమ యం ఆన్‌లైన్లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.బుక్‌ చేసినసమయం బహిరంగంగా అందరికీ కనిపిస్తుంది.అదే విషయం అక్కడ లాగ్‌ బుక్‌లో కూడా రాయాలి.దస్తావేజులు సొంతంగా తయారు చేసుకో వచ్చు. లేదంటే దస్తావేజులు రాసేవారి చేత రాయించుకోవచ్చు. వారందరికీ ఇకపై లైసెన్సులు తప్పనిసరి అవుతుంది. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే నిముషాలు లేదా గంటల వ్యవధిలోనే పట్టాదారు పాస్‌ బుక్‌లో చేర్పులు, మార్పులు, తొలగింపులు జరుగుతాయి.రిజిస్ట్రేషన్‌ చేయకూడని భూములను కంప్యూటర్లో ఆటోలాక్‌ చేస్తారు. అంటే వాటిని ఏ అధికారి రిజిస్టర్‌ చేయలేరు. ప్రజల ఉమ్మడి ఆస్తులు, ప్రభుత్వ భూములను ఇలా పెడతారు. మరోపక్క వారసత్వ భూమిని వారసులకు మార్చే పద్ధతి (ఫౌతీ)ని సరళతరం చేస్తున్నారు.ఇకపై అధికారులు వచ్చి విచారణ చేసే పద్ధతి ఉండదు.కుటుంబం అంతా సంతకాలు పెడితే వెంటనే ఇస్తారు. ఇకపై పట్టా దారు పాస్‌ పుస్తకాల్లో కుటుంబ సభ్యుల వివరాలన్నీ పెడతారు. దీని వల్ల మరణం తర్వాత వారసత్వ భూమి విషయంలో సమ స్యలనేవి రాకుండా ఉంటాయి. పాస్‌ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్లకే కట్టబెడతారు.వ్యవ సాయ భూముల క్రయవిక్రయాలు పూరైన వెంటనే బదిలీ చేయా ల్సి ఉంటుంది. రికార్డు పూర్తి చేసి కొన్నవారికి బదిలీ చేస్తారు. తప్పు చేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్‌, క్రిమినల్‌ చర్యలతోపాటు, తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు.రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై దావా చేయకూడదు. డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తారు. రుణాల మంజూరుకు పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టు కునే విధానానికి ఇక నుండి స్వస్తి పలుకనున్నారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు.అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుండి తొల గింపు ఉంటుంది.అలాగే జాగీరు భూములను ప్రభుత్వ భూము లుగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్టర్‌చేయాలి. ఇక ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో అతి పెద్దది సమగ్ర భూసర్వే. దాదాపు 150 ఏళ్ల క్రితం నిజాం రాజుల కాలంలో, బ్రిటీష్‌ ప్రభుత్వ సూచనతో తెలంగాణలో భూసర్వేజరిగింది. చిన్నచిన్న భూతగాదాల పరిష్కారానికి తహశీల్దార్లు, ఆర్డీవో లు,జాయింట్‌ కలెక్టర్లే రెవెన్యూకోర్టులలోజడ్జిపాత్రను పోషించేవారు తమ శాఖఇచ్చే ఆదేశాలపై తామే విచారణజరిపే వ్యవస్థఇది. ఇప్పుడు ఆ రెవెన్యూకోర్టులను రద్దుచేశారు.వాటిస్థానంలో ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16,137కేసులు ఆ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు బదిలీ అవుతాయి. నిర్ణీత కాలవ్యవధిలో వాటిని తేలుస్తారు.ఇకపై వచ్చే వివాదాలు మాత్రం నేరుగా సివిల్‌ కోర్టులకు వెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది.ఈ ట్రిబ్యునళ్లు కేవలం ఇప్పటికేఉన్న కేసులకు మాత్రమే పరిమితం అవుతాయి. అదేవిధంగా రెవెన్యూ పరంగా ఇకపై కుల సర్టిఫికెట్లు లైఫ్‌ టైం ఉపయోగపడేలా ఒకేసారి ఇస్తారు. ఇక మీదట రెవెన్యూ శాఖ బదులు,గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలే ఈ సర్టిఫికెట్లను ఇస్తాయి.ఇకపై ఆదాయ సర్టిఫికెట్లు మనుషులతోసంబంధంలేకుండా తెలంగాణ ప్రభుత్వందగ్గర ఉన్న డాటా ఆధారంగా ఇస్తారు.మీకున్న ఆస్తిపాస్తుల వివరాలు ప్రభుత్వానికి తెలుసు కాబట్టి (సమగ్ర సర్వే ద్వారా) వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ ఇస్తారు.కాగా రెవెన్యూ వ్యవస్థలోని అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇప్పటికే ప్రజల్లో పాపులారిటీ సంపాదించింది. రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ కొత్త రెవెన్యూ చట్టం కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తహశీల్దార్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5,480మంది విఆర్వోలను వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా సరద్దుబాటు చేస్తారు. అవసరాన్ని బట్టి కొందరిని రెవెన్యూలో కొనసాగిస్తారు.20,292 మంది విఆరేఏలను పూర్తిస్థాయి జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారు. వీ ఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీచేస్తారు. ఏది ఏమైనా కొత్త రెవెన్యూ చట్టం మాత్రం విప్లవాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close