social

తల వెంట్రుకల మాదిరి శ్లేష్మంతో కూడిన కణాలను పోలీ ఉన్నకరోనా

ఫోటోలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో శాస్త్రవేత్తల ప్రచురణ

Kalinga Times, News Desk : శ్వాసవ్యవస్థపై దాడిచేసే కరోనా వైరస్ కణాల ఫోటోలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో శాస్త్రవేత్తలు ప్రచురించారు. తల వెంట్రుకల మాదిరి తంతువులు శ్లేష్మంతో కూడిన కణాలను పోలీ ఉన్నట్టు శాస్త్రవేత్తలు వర్ణించారు. సిలియా అనేది ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం, చిక్కుకున్న వైరస్‌ను గాలి ద్వారా రవాణా చేసే ఎపిథీలియల్ కణాల ఉపరితలంపై జుట్టు లాంటి నిర్మాణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక అయస్కాంత శక్తిని ఉపయోగించిన శాస్త్రవేత్తలు మానవ వాయుమార్గ ఎపిథీలియా ద్వారా ఉత్పత్తిచేసిన సార్స్-కోవి-2 నిర్మాణం, సాంద్రతను పరిశీలించారు.ఈ వైరస్ కణాలు అతిథేయ కణాల ద్వారా శ్వాసకోశ ఉపరితలాలపై విడుదలయ్యే వైరస్ పూర్తిరూపమని పరిశోధకులు పేర్కొన్నారు. ఇమేజింగ్ పరిశోధన మానవ శ్వాసకోశ వ్యవస్థలో ప్రతి కణంలో ఉత్పత్తయి, విడుదలయ్యే చాలా ఎక్కువ ఆర్ఎన్ఏలను వివరించడానికి సహాయపడుతుందని వివరించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వ్యక్తిలోని వివిధ అవయవాలకు వ్యాపించడమే కాదు, ఇతరులకు సంక్రమించడానికి సాధనంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. వ్యాధి సోకిన వ్యక్తులు మాస్క్‌లు ధరించడం వల్ల సార్స్-కోవి-2 వ్యాప్తిని నియంత్రణకు సహకరిస్తాయని తెలిపారు.నార్త్ కరోలినా యూనివర్సిటీ చిల్డ్రన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. కెమిల్లె ఎహ్రే నేతృత్వంలోని ఈ పరిశోధన సాగింది. వైరస్ ఫోటోలను సంగ్రహించిన శాస్త్రవేత్తలు.. గాలి ద్వారా సార్స్-కోవి-2 ఎలా సంక్రమిస్తుందో సులభంగా అర్థమయ్యేలా వీటికి గ్రాఫిక్స్‌ను కూడా జతచేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close