Telangana
వరంగల్ ముంపు ప్రాంతాల్లో మంత్రి కెటీఆర్ పర్యటన
Kalinga Times, Hyderabad : ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమయ్యింది. ఈ ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నగరంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న కేటీఆర్కు.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం నయీంనగర్ నాలా, తదితర ముంపు ప్రాంతాలను రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి పరిశీలించారు.