Telangana
33 డివిజన్ లో మొక్కల (తులసి కరివేపాకు)పంపిణీ
Kalinga Times , Godavarikhani : రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 33 డివిజన్ లో హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ డివిజన్ ప్రజలకు మొక్కలు (తులసి కరివేపాకు)పంపిణీ చేశారు. కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిలో భాగంగా హరితహారం కార్యక్రమం లో డివిజన్లోని ప్రజలకు మొక్కలు అందజేస్తూ.. వాటిని సంరక్షించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి, శ్రీ మాల, నిర్మల, Rp రాజకుమారి, విజయ,డివిజన్ సూపర్వైజర్ ఉమామహేశ్వర్,దొంత సతీష్ మేదరి శ్రీనివాస్,షంషేర్,మొండయ్య ,మరియు డివిజన్ ప్రజలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.