Telangana
స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు దేశ విముక్తి కోసం మహనీయుల అలుపెరగని పోరాటమే
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
Kalinga Times, Godavarikhani : భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగాలు చేసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో దేశ విముక్తి కోసం మహనీయులు చేసిన అలుపెరగని పోరాటమే అన్నారు. స్వాతంత్య్ర తెలంగాణరాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కెటిఆర్ గారు ప్రజల సంక్షేమానీకి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అందరిపై ఉందన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరువును మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా మెలగాలని, మనోధైర్యంతో కరోనా మహమ్మారిపై పోరాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని మాస్కులు, శానిటేజర్ లు తప్పకుండా వాడాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో రామగుండం నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కమిషనర్ ఉదయ్కుమార్ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి -భూమయ్య, అడ్ధాల స్వరూప- రామస్వామి, నీల పద్మ- గణేష్, గనముక్కుల తిరుపతి, నాయకులు అచ్చ వేణు, చల్లగురుగుల మెగిళి, జహీద్ పాషా, గోలుసు నాగరాజు, సీరాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు