Telangana
వైరస్ వ్యాప్తి చెందకుండా డివిజన్ పరిధిలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే
Kalinga Times, Madapur : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.6వ రోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం మరియు సుభాష్ నగర్ బస్తీలో స్థానిక ప్రజలు విజ్ఞప్తి మేరకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కార్పొరేటర్ సొంతంగా ఏర్పాటు చేసిన సోడియం హైపోక్లోరైడ్ ట్రకు ద్వారా స్ప్రే చేయడం జరిగింది..ఈ సంధర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందని,ప్రజలు కూడా అవసరం ఉంటే తప్ప భయటకి రావ్వొద్దని కోరారు..ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్,ఏరియా సభ్యులు రవి కుమార్,శ్యామ్,ప్రవీణ్,జ్ఞానేశ్వర్,రాజు,గోపి తదితరులు పాల్గొన్నారు.