Kalinga Times, Manchirial : తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘‘మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు’’ అంటూ మంత్రి హరీష్ ట్వీట్ చేశారు.
మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు pic.twitter.com/rnXAgktvIf
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) August 6, 2020