Telangana
33 డివిజన్ లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో హైడ్రోక్లోరైడ్ స్ప్రే
Kalinga Times, Godavarikhani : రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 33 డివిజన్ కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తూ విజృంభిస్తున్న తరుణంలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో 33 డివిజన్ లో హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేయించారు. కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం డివిజన్ మొత్తం హైడ్రో స్ప్రే చేయించడం జరిగింది. డివిజన్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది.స్వీయ నియంత్రణ కోసం మాస్కులు శానిటైజర్ ఉపయోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించారు ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ డివిజన్లోమంచి కార్యక్రమాలు చేపడుతున్న అందుకు పలువురు కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపర్వైజర్ ఉమామహేశ్వర , దొంత సతీష్ ,ఎండి ఉమర్,మంథని శ్రీనివాస్ ,ఎండిషంషేర్ ,మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు