social
నాగదేవుడిని ప్రార్థించేందుకు సరైన రోజు నాగపంచమి
Kalinga Times,Hyderabad: నాగదేవుడిని ప్రార్థించేందుకు సరైన రోజు నాగపంచమి ఆ రోజు పూజలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వంశాభివృద్ధితో పాటూ భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. నాగపంచమి పూజ ఎలా చేయాలో సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించి చెప్పినట్టు స్కంధపురాణంలో ఉంది. ఆ రోజున ఉదయం తొమ్మిదిగంటలలోపే పూజ పూర్తిచేయాలి. ఇంటిని శుభ్రం చేసి, గడపలో ముగ్గులు పెట్టాలి. శుభ్రంగా తలకి స్నానం చేసి ఎరుపురంగు దుస్తులు ధరించాలి. పూజకు పంచామృతము, జాజులు, సంపెంగలు, గన్నేరు పూలు, కనకాంబరాలు, నాగప్రతిమ, గంధము, కుంకుమ, ఎరుపు రంగు వస్త్రం, అక్షింతలు, అరటిపండ్లు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని వండాలి. పాయసము వండితే ఇంకా మంచిది. దీపాలకు రెండు మట్టిప్రమిదలను కొనుక్కోవాలి. ఏడు వత్తులను సిద్ధం చేసి నేతితో దీపాన్ని వెలిగించాలి. పూజాగదిలో నాగ ప్రతిమ ముందు కూర్చుని ఓం నాగరాజాయ నమ: అని 108 సార్లు జపించాలి.