Religioussocial

ప్రతి ఇంటిని శోభాయమానం చేసే శ్రావణమాసం

Kalinga Times, Hyderabad : శ్రావణమాసం లో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.
                 ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది.


శ్రావణ సోమవారములు
సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. అంటే కాకుండాఅమ్మవారికి ఆమెను పూజించేకంటే ఆ పరమేశ్వరుని పూజిస్తేనే ఎక్కువమక్కువ అనిపెద్దలుచెపుతారు.
శ్రావణ శనివారములు
ఈ శ్రావణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు .


శ్రావణ మంగళవార వ్రతం
మంగళగౌరీ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి,ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలోసుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
నాగపంచమి
శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి పాముపుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు.


వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలలో ఏదైనా ఒకవారం ఈ వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు.లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారమంటే చాలాఇష్టం అని శ్రీ సూక్తం తెలియచేస్తోంది.


రాఖీ పౌర్ణమి
శుక్ల పక్ష పౌర్ణమి.ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిమరియు రాఖీ పౌర్ణమి అంటారు.ఈ రోజున కొత్త యజ్ఞోపవీతం( జంధ్యం)వేసుకుంటారు, అంతేకాకుండా శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుం టాము.


శ్రీకృష్ణ జన్మాష్టమి
ఈమాసంలోనే ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా అందరూ కృష్ణాష్టమి జరుపుకొంటారు.
మతత్రయ ఏకాదశి
శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close