Telangana
సిఎం కెసిఆర్‌కు మోడీ పలు సూచనలుసిఎం
Kalinga Times,Hyderabad : కోవిడ్‌తో దేశంలో విపత్కరమైన ప రిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా అండదండలు అందిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ సిఎం కెసిఆర్‌కు భరోసా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రా ష్ట్రాలు ధైర్యంగా ముందుకు సాగాలంటూ వెన్నుతట్టారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌లో సిఎం కెసిఆర్ తో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? రోజుకు ఎన్ని పాజిటివ్ కే సులు వస్తున్నాయి.
రికవరీ శాతం ఎంత? రోజుకు ఎంత మంది డిశ్ఛార్జి అవుతున్నారు?
వైరస్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి? తదితర అంశాలపై కూడా మోడీ ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే కరోనా తీవ్రతతో పాటు కట్టడికి చేపడుతున్న నివారణ చర్యలు, కరోనా రోగులకు అందిస్తున్న సేవలు, చేస్తున్న టెస్టులు, బెడ్స్ తదితర అంశాలపై కూడా ప్రధాని ఆరా తీశారు. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మార్గదర్శకాల గురించి అడిగి తెలుకున్నట్లు సమాచారం. అనంతరం రాష్ట్రంలో రోజు వారిగా నమోదు అవుతున్న కరోనా కేసుల వివరాలను పధానికి, సిఎం కెసిఆర్ వివరించారు.
వైరస్ కట్టడి కోసం టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. అలాగే రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో దృష్టి సారించామని మోడీ దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకొచ్చారు. ఒక వేళ కేసుల సంఖ్య మరింతగా పెరిగినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అందుకు అవసరమైన బెడ్స్‌ను కూడా సిద్దం చేసి ఉంచినట్లు తెలిపారు. రోగులకు సేవలను అందించడంలో వైద్య శాఖ, డాక్టర్ల బృందం ఇరవై నాలుగు గంటల పాటు శ్రమిస్తోందన్నారు. తదనంతరం కరోనా నివారణ, తీసుకోవాల్సిన చర్యలపై సిఎం కెసిఆర్‌కు మోడీ పలు సూచనలు, సలహాలు చేసినట్లు తెలిసింది.