Telangana

ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా పారదర్శకం

Kalinga Times,Hyderabad : ప్రభుత్వ కార్యకలాపాలు ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పరిపాలన పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు ఈ-ఆఫీస్‌ విధానాన్నిఅమలుచేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జనరల్‌ అడ్మినిస్టేషన్‌ (జీఏడీ), ఎక్సైజ్‌, కమర్షియల్‌ టాక్స, సీసీఎల్‌ఎ, మహిళా శిశు సంక్షేమశాఖ ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మిగిలిన శాఖలు కూడా ఈ-ఆఫీస్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరు శాఖలు ఈ-ఆఫీస్‌ ద్వారా శనివారం నుంచి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా ఈ-ఆఫీస్‌ పనితీరును పరిశీలించిన సీఎస్‌ ఆయా శాఖల అధికారులను ఆభినందించారు. ప్రభుత్వం ఆదేశించిన తక్కువ సమయంలోనే ఆయాశాఖలు ఈ-ఆఫీస్‌ విదానాన్ని రూపొందించుకోవవడాన్ని సీఎస్‌ ప్రశంసించారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close