Film
ఒరేయ్ బుజ్జిగా..లిరికల్ సాంగ్

Kalinga Times, Hyderabad : యంగ్ హీరో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగాశ్రీలక్ష్మి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా.. ఇప్పటికే విడుదలైన టీజర్,పాటలకి మంచి స్పందన వచ్చింది.. కలలు చూసినా కన్నులే.. లిరికల్ సాంగ్‌ను విడుదలచేశారు..ఈ విరహ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు.సిద్ శ్రీరామ్ అందే అద్భుతంగా ఆలపించారు.. అనూప్‌రూబెన్స్ సంగీతం అందించారు.. హెబ్బాపటేల్, వాణీవిశ్వనాద్, నరేష్, పోసాని , తదితరులు నటించారు..