Film
మహేష్ తొలిసారిగా డ్యూయల్ రోల్

Kalinga Times,Hyderabad : సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తదుపరి మూవీ షూటింగ్‌కు సిద్దం అవుతున్నారు.. దర్శకుడు పరశురామ్‌తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుపెట్టాలనేది ఆలోచనలో ఉన్నారట.మహేష్ తొలిసారిగా డ్యూయల్ రోల్ ట్రై చేస్తున్నారట.. రెండు భిన్నమైన స్వభావాలు కలిగిన ట్విన్స్‌గా కన్పిస్తారని టాక్.ప్రధానంగా ఈ మూవీ ఆర్థిక నేరాలపై తెరకెక్కే క్రైమ్, రివేంజ్ డ్రామా అయ్యే సూచనలున్నాయని అంటున్నారు. పైగా అభిమానులు కూడ ఆయన్ని ఎప్పటినుంచో డ్యూయల్‌రోల్‌లో చూడాలనే కోరిక ఉంది. ఈచిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్‌సంగీతం అందిస్తున్నారు.