social
కేసులు పెరగడంతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి
Kalinga Times, Hyderabad : మహమ్మారి తన ప్రతాపం చాటుతూ రోజుకు వందలాది మంది ఆసుపత్రుల బాట పట్టేలా చేసింది. జూన్ చివరి వారం నుంచి టెస్టుల సంఖ్య పెంచడంతో రోజుకు 1500 కేసులు బయటపడ్డాయి. కేసులు పెరగడంతో అధికారులు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో వేలాదిమంది కూలీలు, కార్మికులు పల్లె బాట పట్టారు. జనం పట్టణం వీడటంతో కరోనా కంట్రోల్ అవుతుందని భావించినప్పటికి అంతకంతకు పెరిగి ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. గాంధీ, చెస్ట్, కింగ్‌కోఠి, నేచర్‌క్యూర్, యునానీ ఆసుపత్రుల్లో కాకుండా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వందలాది మంది చికిత్సలు పొందుతున్నారు. లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. నాలుగు రోజలు నుంచి గ్రేటర్ సమీప జిల్లాల కేసులు సంఖ్య వివరాలు చూస్తే ఈ నెల 13న జీహెచ్‌ఎంసీ 926, రంగారెడ్డి 212, మేడ్చల్ 53, ఈనెల 14న జీహెచ్‌ఎంసీ 81 5, రంగారెడ్డి 240,మేడ్చల్ 97, ఈనెల 15వ తేదీన జీహెచ్‌ఎంసీ 796, రంగారెడ్డి 212, మేడ్చల్ 115, ఈనెల 16న జీహెచ్‌ఎంసీ 988, రం గారెడ్డి 224, మేడ్చల్ 160 కేసులు నమోదై అగ్రస్దానంలో నిలిచాయి.ఈనెలాఖరు వరకు ఈజిల్లా పరిధిలో రోజుకు 1800లు దాటవచ్చని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు.నగర ప్రజలు అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలి తప్ప సరదా కోసం రోడ్లపైకి రావద్దని,వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్కులు ధరించి,సామాజిక దూరం పాటించాలని స్దానిక వైద్యాధికారులు సూచిస్తున్నారు.