Telangana
స్ట్రామ్ వాటర్ పైపులైన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన
Kalinga Times, Hyderabad : వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా స్ట్రామ్ వాటర్ పైపులైన్ పనులను చేపట్టనున్నట్లు శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 లో రూ. 40 లక్షల నిధుల వ్యయంతో స్ట్రామ్ వాటర్ పైపులైన్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బుధవారం శంకుస్థాపన చేశారు. సెంట్రల్ పార్కు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. తమ కాలనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గార్లకు కాలనీ అధ్యక్షురాలు రమణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ఉపాధ్యక్షులు వేణు గోపాల్ రెడ్డి, కుంచాల రమేష్, పద్మారావు, వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, కొడిచర్ల రాములు, సెంట్రల్ పార్కు ఫేజ్ 2 అధ్యక్షురాలు రమణి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కాలనీ వాసులు సురేష్, వెంకటేశ్వర్ రావు , హరినారాయణ, నాగరాజు, రాధాకృష్ణ, ప్రవీణ్, శేఖర్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు..