Film
రాంగోపాల్ వర్మ కు నెటిజన్ల తాజా పేరు బిల్డప్ వర్మ
Kalinga Times, Hyderabad : టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు నెటిజన్లు తాజాగా పెట్టిన పేరు బిల్డప్ వర్మ. అంకిత మహారాణాను అప్సర రాణిని చేసి… టాలీవుడ్ వెండితెరకు తానే తొలిసారిగా పరిచయం చేశానంటూ బిల్డప్ ఇచ్చాడు. దీంతో రాంగోపాల్ వర్మకు బిల్డప్ వర్మ అంటూ సరికొత్త పేరు పెట్టారు. అప్సర రాణి ని ఒడిశా నుంచి తీసుకువచ్చి పరిచయం చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్న వర్మ అంకిత మహరాణా పేరును అప్సర రాణిగా మార్చి పరిచయం చేస్తున్నాడు. టాలీవుడ్ కుర్రాళ్లకు కొత్తకాదు. ఎందుకంటే ఆమె టాలీవుడ్లో నటించిన రెండు చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించి అందరి మనసులు దోచేసింది.
ఆమె నటించిన చిత్రాలు
‘4 లెటర్స్’, ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రాలు. మరి ఆమె పేరును మార్చి.. నేనే పరిచయం చేస్తున్నానని వర్మ ఎందుకు బిల్డప్ ఇస్తున్నాడనేది ఆయనకే తెలియాలి.