Film

‘ఆచార్య’ ఐటమ్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ

Kalinga Times, Hyderabad : మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే కొత్త షెడ్యూల్ మొదలుకావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఈ షెడ్యూల్ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా బలంగా ఉండబోతుందట. చిరు పాత్రలో ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని కొరటాల తెలిపాడు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయని.. అందులో ఓ మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు.అయితే ఐటమ్ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా నర్తించనుందని తెలిసింది. ఈ బ్యూటీ మెగాస్టార్‌తో కలిసి ఐటమ్‌సాంగ్‌లో హుషారుగా స్టెప్పులు వేయనుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close