Telangana
మొక్కలు నాటిన కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
Kalinga Times mkeesara : బుధవారం కీసరలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరవ విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని సమకూర్చాలని తెలిపారు.కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కుని, సామాజిక దూరం పాటించాలని అత్యవసర సమయంలో ని బయటకు రావాలని సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదని వీలైనంత వరకు దూరాన్ని పాటిస్తూ ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధురి, కీసర తహసిల్దార్ నాగరాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.