Telangana
ఉప్పల్‌లో ఐటీ సెజ్
Kalinga Times, Hyderabad :హైదరాబాద్ నగరాన్ని నలు మూలలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ సహా దాని అనుబంధ సంస్థలను నగరం నలుమూలలా విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ చర్చించారు. హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్పర్శన్ (గ్రిడ్) కార్యక్రమంలో భాగంగా ఐటీ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో ఉప్పల్‌లో ఐటీ సెజ్‌లో బుధవారం సమావేశం అయ్యారు. ముఖ్యంగా తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఐటీ పరిశ్రమలను నగరంలోని నలుమూలలకు విస్తరించే గ్రిడ్ పాలసీతో ప్రభుత్వం ముందుకు రానున్నట్లు తెలిపారు.ఐటీ పరిశ్రమలను తూర్పు హైదరాబాద్‌లో నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలను, మౌలిక వసతులను కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన సమకూర్చుతామని వెల్లడించారు.