National
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కార్యాచరణ అజెండా
Kalinga Times, New Delhi : భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాల్లో కార్యాచరణ అజెండాను ప్రధాని మోడీ ప్రతిపాదించారు. దీర్ఘకాలిక, వ్యూహాత్మక లక్షాలతో కూడిన సంబంధాలు దృఢంగా నిలుస్తాయని ప్రధాని అన్నారు. ఇయు ఇండియా 15వ సదస్సు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ప్రసంగించారు. కార్యాచరణ అజెండాను కాల వ్యవధిలో అమలయ్యేలా రూపొందించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్, ఇయు దేశాలు ప్రజాస్వామ్యం, బహుళత్వం, అంతర్జాతీయ సంస్థలు, సమ్మిళితం, స్వేచ్ఛ, పారదర్శకతలాంటి అంతర్జాతీయ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని ప్రధాని కొనియాడారు. ఇండియాఇయులు మానవుడే కేంద్రంగా ప్రపంచీకరణ, ఆర్థిక పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని అన్నారు. ఇయు కూటమిలో 27 దేశాలున్నాయి. 2018లో భారత్‌కు ఇయు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 201819లో ఇయు, భారత్ మధ్య 115.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అందులో ఎగుమతులు 57.17 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 58.42 బిలియన్ డాలర్లు.