Telangana
శిథిల అవస్థలో మంచి నీళ్ళ ట్యాంక్
Kalinga Timews,మేడ్చల్ జిల్లా (ది క్రైమ్ న్యూస్):కీసర మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలోని మంచినీటి ట్యాంక్ పాత పడి శిథిల అవస్థలో ఉన్న మంచి నీళ్ళ ట్యాంక్ పట్టించుకో లేకపోవడం అందులో గ్రామ పంచాయతీ ఆఫీసుకు ఆనుకొని ఉండడం గమనార్హం.ముందస్తుగా తెలుసుకున్న గ్రామ పంచాయతీ పెద్దలు దీని పట్టించుకోక పోవడం వెనుక కారణం ఏంటి.? పైకి ఎక్కడానికి ఇనుప రాళ్లతో నీళ్ల ట్యాంక్ అమర్చిన ఇనుప రాడ్లు విరిగి పక్కనే ఉన్న యాప చెట్టు పైన పట్టించుకోని పరిస్థితి. తిమ్మాయిపల్లి పంచాయితీ అధికారులు ఇప్పటికైనా మరమత్తులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.