Telangana
కెసిఆర్ సార్ అప్పుడప్పుడు రోడ్డు పక్కన చూస్తూ వెళ్ళండి సార్
కళింగ టైమ్స్ మేడ్చల్ జిల్లా : శామీర్ పేట మండలంలో తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ మిక్సర్ కంపెనీ ముందట (ఫుట్పాత్) పైన పాదచారులు నడిచే దారిలో విచ్చలవిడిగా పనికిరాని సిమెంట్ ను రోడ్డు పై వేస్తున్నా కూడా అధికార యంత్రాంగంకు మాత్రం కనబడడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద రాళ్లు ఉన్నా అధికారులు మాత్రం చూస్తూ ఉరుకుంటున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం గోతులు తియ్యడం తో రాళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు. వాటిని తొలగించమని అధికారులు కాంట్రాక్టర్లకు చెప్పకపోవడం, పెద్ద వర్షం వచ్చి మట్టి అంతా తొలగి పోయి అక్కడ ఉన్న రాళ్లన్నీ రోడ్డు పైకి రావడంతో ప్రమాదాలు జరగవా అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
అసలే ముఖ్యమంత్రి వెళ్లేదారి ..
మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హరితహారం మొక్కలను నాటాలని పచ్చదనాన్ని తేవాలని పలుసార్లు చెబుతున్నా కూడా సిమెంట్ మిక్సర్ కంపెనీ దగ్గర తూతూమంత్రంగా చెట్లను నాటుతూ వెళుతున్నారు. కానీ కంపెనీ దారులకు మాత్రం రాళ్ళను తొలగించమని చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అప్పుడప్పుడు రోడ్డు పక్కన చూస్తూ వెళ్ళండి సార్. అప్పుడైనా అధికారులు మారుతారేమో……..?