Kalinga Times, Hyderabad :ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని టౌన్ మైసమ్మ గుట్ట ప్రాంతంలో హత్య జరిగింది.ఎల్.బీ నగర్ మన్సురబాధ్ కు చెందిన సైదులు అనే వ్యక్తి ని హత్య చేసి నిందితుడు ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుని భార్యతో ఆక్రమ సంబంధమే హత్యకు కారణమని సమాచారం. నిందితుడు అలకుంట యాదగిరి ఎల్.బీ నగర్ మన్సురాబాధ్ బీ.హెచ్.కె కాలనికి చెందిన వ్యక్తి. సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి,ఏసిపి నర్సింహ రెడ్డి,ఘట్ కేసర్ పోలీసులు హత్య జరిగిన స్పాట్ ను పరిశీలించారు.క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు.