Religious
గల్ఫ్ లో చిక్కుకున్నోళ్లను ప్రభుత్వమే తీసుకురావాలి
Kalinga Times, Hyderabad : అరబ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర కార్మికులను రప్పించేందుకు వెంటనే చర్యలు తీసు కోవాల ని టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ,,దేవులపల్లి యాదగిరి డిమాండ్ చేశారు,విలేకర్ల సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ అరబ్ దేశాల్లో ఉన్నవాళ్లంతా కరోనా కారణంగా కష్టాల్లో పడ్డారని . రాష్ట్ర సర్కారు కేంద్రంతో సమన్వ యం చేసుకుని , వారిని గా తీసుకురావాలని కోరారు . కరోనా వ్యాప్తితో గల్ఫ్ లో వలస కార్మికుల జీవితాలు ఆగమైపోయాయని , చమురు ధరలు పడిపోయి అక్కడి ఆర్థిక వ్యవస్థ దె బ్బతిని , కార్మికులను పనుల్లోంచి తీసేశారని యాదగిరి వివరించారు . ఉద్యోగాల్లేక , చేతిలో డబ్బుల్లేక , కనీస వైద్య సదుపాయం కూడా దొరకని పరిస్థితిలో మన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు . విదేశాల్లోని కార్మికులను తీసుకొచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేసిన కేంద్రం , వారి నుంచి చార్జీలు వసూలు చేయడం సరికాదని పేర్కొన్నారు . కార్మికులను హైదరాబాదు తీసుకొచ్చేందుకు ప్ర భుత్వాలే చార్జీలు భరించాలని కోరారు . ఎయిర్ పోర్ట్ నుంచి ఊర్లకు పంపడానికి కూడా వాహనాలను ఏర్పాటు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు . వారు సొంతూర్లలో బతకడానికి తగిన సాయం అం దించాలని విజ్ఞప్తి చేశారు . విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ ( జీసీసీ ) దేశాల్లో రాష్ట్రానికి చెందిన లక్షల మంది కార్మికులు ఉన్నార ని , వారి నుంచి భారీగా విదేశీ మారకం కూడా వస్తోం దని తెలిపారు . ఈ కార్యక్రమములో అచ్చిన సత్తయ్య ,చెలికాని యాదగిరి ,అనరాజు నాగరాజు ,బాగు శ్రీకాంత్ , ,దేవులపల్లి రాజు ,దేవులపల్లి కృష్ణ శ్రీను ,లు పాల్గొన్నారు ,