
కళింగ టైమ్స్ ప్రతినిధి
పసికందుపై వికృత క్రీడ*
విషపు నాగుకుఉరే సరి
పాలు తాగే వయస్సుపై
కామాంధుడు రాక్షసత్వం..
పసిమొగ్గను చిదిమేసి..
పాశవికంగా వికటాట్టహసం..
మానవత్వం మంటగలిసినా ..
మౌనంగా మూల్గుతున్నం..
కామ రక్కసి పైకి
కత్తి దూసే దారి లేదా..?
అప్పుడే పుట్టిన పిండాన్ని
అంగట్లో దొరికే అండాన్ని
పిశాచాల సంతలో..
కామాంధుల కొనుగోలు వస్తువై వెలుగుతుంటే..
కామ వాంఛలతో..
తోడేళ్ల అవతారమెత్తిన.
మృగాళ్ల వేటకు ముగింపు లేదా..? .
పాలు తాగే పసిపాప
లేత బుగ్గల చిన్నారి
పెళ్లీడు కొచ్చిన చెల్లాయి
భర్త వదిలేసిన అక్కయ్య
మగతోడు వీడిన మగువ
అభాగ్య ఆబలలపై
మాటేసే కళ్లు..
కాటేసే రాభందులు,
మానవ మృగాల చూపులు-
పడతులపై పడుతుంటే. చూస్తూనే ఉందామా..?
మృగాళ్ల పైశాచిక కృత్యాలకు..
కామాంధుల
క్రీడా విన్యాసాలకు
అబలల అక్రోశాలు..
పసిప్రాణాల ఆర్తనాదాలు..
చిద్రమైన వారి బతుకుల గోస
భూమాత గుండెకు గాయం కాదా..?
మానవ మృగాళ్ల పంజా దెబ్బలకు
లేడికూనలు బెంబేలెత్తుతున్నాయి.
కామాంధుల పాశావిక
వికృత పందెంలో ఓడిపోయి
ఆశ్రువులు నేల రాల్చుతున్నాయి.
కన్న వారికి పుట్టెడు
కన్నీళ్లు మిగిల్చుతున్నాయి.
పసికందులపై వికృత క్రీడకు
అంతంలేదా…?
రావాలి మార్పులు సమాజంలో..
కామ వాంఛలతో
వావి వరసలు
మరచిపోయే
మానవ మృగాళ్ల
జననాంగాలను
కోసేయాలి..
పసికందులపై
వికృత చేష్టలకు
తెగబడే రాక్షసుల
నవ రంధ్రాలు మూసేయాలి
అబలలపై ఆగయిత్యాలకు
సాహసిస్తే..
నడిరోడ్డుపైనే
దుర్మార్గుల
చేతులు, కాళ్లూ తీసేయాలి..
(పసిపాపపై అఘాయిత్యం చేసి సభ్యసమాజంలో జీవించే అర్హత కోల్పోయిన ఆ పశువును చట్టం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. చిన్నారి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలుపుతూ.. ఆశ్రునయనాలతో…-
K. B. Raju. రంగారెడ్డి dist. ఇంచార్జి.