National
డిల్లీలో భూకంపం
Kalinga Times, New Delhi : ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కూడా పడుతోంది. దుమ్ము, ధూళి కారణంగా దగ్గరగా వచ్చే వాహనాలు కూడా కనపడకుండా పోయింది.దుమ్ము, ధూళితో జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లను దుమ్ముతో పాటు చెట్ల ఆకులు కప్పేశాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా చీకట్లు కమ్మేశాయి. అంధకార పరిస్థితులేర్పడ్డాయి.
భూకంపం
దీనికి తోడు ఢిల్లీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 1:45 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో గత నెల 12, 13 తేదీల్లో భూకంపం వచ్చింది.నెల వ్యవధిలోనే ఢిల్లీలో వరుస ప్రకంపనలు రావడం ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.