Telangana
పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం
Kalinga Times, Medchal : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బృందావన్ కాలనీ లోని అయ్యప్ప సేవా సమితి చైర్మన్ మేకల అయ్యప్ప లక్ష్మీల పెళ్లి రోజు సందర్భంగా పారిశుద్ధ కార్మికులు నాయకులు కార్యకర్తలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారి కుమార్తె జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ ఈరోజు తన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా అన్ని దానాలలో గొప్పదైన అన్నదానం చేయాలని మేము చేపట్టిన ఈ విందు భోజన కార్యక్రమంలో అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికులు నాయకులు కార్యకర్తలు పాల్గొని భోజనాలు స్వీకరించి శుభాశీస్సులు అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సృష్టికి మూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ విపత్కర కాలంలో వైరస్ నిర్మూలన కోసం అహర్నిశలు వారి కుటుంబ సమస్యలను పక్కనపెట్టి దేశ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తున్న డాక్టర్ లు పోలీస్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనీ వారి సేవలు అభినందనీయమని కొనియాడారు అనంతరం జవహర్ నగర్ పోలీస్ హౌస్ ఆఫీసర్ బిక్షపతి రావు డాక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస రావు లను ఘనంగా సత్కరించారు తదుపరి యువ నాయకులు భార్గవ్ రామ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల పెళ్లిరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనం స్వీకరించి ఆశీస్సులు అందజేసిన నాయకులు కార్యకర్తలు పారిశుద్ధ కార్మికులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ గుప్తా తో పాటు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు