Andhra Pradesh
మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం
Kalinga Times, Hyderabad : సిఎం జగన్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడి, రెండుమూడు రోజులు చికిత్స పొందే వారికి రూ. లక్ష ఇస్తామని చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని అన్నారు. 5 బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. చనిపోయిన పశువుకు రూ. 25 వేల వంతున యజమానికి పరిహారం చెల్లిస్తామని సిఎం జగన్ చెప్పారు.