Andhra Pradesh

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కెమికల్ గ్యాస్ లీక్

Kalinga Times, Vizag City : విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
కాగా.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. దాదాపు 200 మందికి అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా లీకేజీ అదుపులోకి రాలేదు.  దీంతో ఎల్జీ పాలిమర్స్‌, వెంకటాపురం పరిసరాల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నారు. ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్‌లు మోగిస్తూ హెచ్చరించారు.ఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ హుటాహుటిన స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో 2 గంటలు పట్టొచ్చని వెల్లడించారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురైఉంటారుని ఆయన తెలిపారు. యంత్రాలను ప్రారంభించే సమయంలో మంటలు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close